జనంన్యూస్. 23.నిజామాబాదు..
కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు . కండువా కప్పి ఆహ్వానించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. రేకులపల్లి భూపతి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో విస్తృత ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.నగరంలోని కంటేశ్వర్ బైపాస్ వద్ద గల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. పీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో సిరికొండ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నాగుల రాజేశ్వర్ గౌడ్, వార్డు మెంబర్ మిద్దుల నరేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.అలాగే డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామ సర్పంచ్ భాస్కర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మహమ్మద్ అక్తర్, షకీల్, హకీమ్, అజార్, గౌస్, రాజా, మహమ్మద్, సల్మాన్, షారుక్, సజీద్, అఫ్రోజ్ తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి మాట్లాడుతూ,“ప్రజలకు నేరుగా మేలు చేసే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వానివే. అదే ప్రజల విశ్వాసానికి కారణం” అని అన్నారు.రాబోయే జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.మహిళల అభ్యుదయానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత రేషన్ కార్డులు, ఉచిత సన్న బియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా, రుణమాఫీ, పంట బోనస్ వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, బర్దిపూర్ సర్పంచ్ భాస్కర్, కిషోర్, తూంపల్లి మహేందర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



