Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 05 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్

మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు‌ గద్దల అశోక్ మాదిగ,ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని‌ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తపల్లి అంజయ్య మాదిగ, హాజరై మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మార్పీఎస్ ఏ పిలుపు ఇచ్చిన తప్పకుండా హాజరై ఉద్యమంలో భాగస్వాములు కావాలని అన్నారు.గ్రామశాఖ అధ్యక్షులుగా పాతకోట్ల బాలయ్య, గౌరవసలహా దారులుగా కుడుముల వీరయ్య పెద్దమాదిగ, సిర్రా శ్రీను,కుడుముల బిక్షం ను మరియు కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు.