Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 23

రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. తర్లుపాడు మండలం గొల్లపల్లి పంచాయితీలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.మన పూర్వీకులు ఆరికలు, కొర్రలు, సజ్జలు, జొన్నలు వంటి తృణధాన్యాలను సాగు చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా ఉండేవారని ఎమ్మెల్యే గుర్తుచేశారు.తృణధాన్యాల సాగుకు పెట్టుబడి తక్కువని, రైతులు వీటిపై దృష్టిపెట్టాలనికోరారు.కూటమిప్రభుత్వంతృణధాన్యాలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా చిన్నపాటి పరిశ్రమల స్థాపనకు సబ్సిడీలు ఇచ్చి రైతులను ఆర్థికంగా బలోపేతంచేస్తామన్నారు.ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహిస్తూ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులుసద్వినియోగంచేసుకోవాలనిపిలుపునిచ్చారు.తర్లుపాడు మండలానికి వెలుగొండ జలాలు తెచ్చేందుకు తాము చేసిన పోరాటాన్ని ఎమ్మెల్యే వివరించారు. వచ్చే ఏడాది లోపు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.మార్కాపురం ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల గొల్లపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చిత్రపటానికి గ్రామ ప్రజలుపాలాభిషేకంనిర్వహించారు.అనంతరం ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు ఈకార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, మాజీ జడ్పిటి సి రావి బాషాపతి రెడ్డి టిడిపి మండల అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి, సీనియర్ నాయకులు కంచర్ల కాశయ్య, క్లస్టర్ ఇంచార్జీ మేకల వెంకట్, చింతలపూడి వెంకటేశ్వర్లు, వేసేపోగు జాన్, కొలగట్ల నారాయణ రెడ్డి, శసానికొమ్ము కోటిరెడ్డి, దాసు, ఈర్ల వెంకయ్య, నంద్యాల కాశయ్య, నంబుల లక్ష్మయ్య, పెసల వెంకటేశ్వర్లు, గుర్రపుశాల నరసింహ, కందుల చిట్టిబాబు, షేక్ ఖాసీం వలి, వ్యవసాయ శాఖ అధికారులు , రైతులు పాల్గొన్నారు.