మురమళ్ల: నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిఒక్కరు సహకరించి దాతలు ముందుకు రావాలని, దేశంలోనే శైవ క్షేత్రాలలో అత్యంత విశిష్టత కలిగిన ఈ ఆలయం పునర్నిర్మా ణం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ముమ్మిడివరం శాసన సభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు అన్నారు. మంగళవారం ఆలయ చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణం రాజు అధ్యక్షతన ఆలయ ఆవరణలో గ్రామ సభ జరిగింది. శాసన సభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చరిత్ర కలిగిన ఈ ఆలయం వర్షాలకు ముంపునకు గురి అవుతొందని దీనిని పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించాలని తలపెట్టినట్లు తెలిపారు. పునర్నిర్మాణ విషయం గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందన్నారు. స్పందించి తక్షణమే నిర్మాణం నిమ్మిత్తం రు 4 కోట్లు మంజూరు చేశారన్నారు. అలాగే పునర్నిర్మాణ నమూనా పరిశీలించారు, ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ మాట్లాడుతూ నిర్మాణ విషయంలో కంచి స్వామిజి సలహాలు, సూచనలు తీసుకొని తదనుగుణంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. స్వామి వారి అమ్మవారి ముల విరాట్ ని కదపకుండా నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయ చరిత్ర పునర్నిర్మాణ ఆవశ్యకత గురించి సమావేశంలో వివరించారు. అసిస్టెంట్ కమీషనర్ వి. సత్యనారాయణ మాట్లాడుతూ పునర్నిర్మాణ పనులకు సంభందించి దేవాదాయశాఖ కమీషనర్ అనుమతులతో టెండర్లు ఆహ్వానించామన్నారు. గ్రామస్తులు అడిగిన ప్రశ్నలను నివృత్తి చేశారు. అలాగే 2026 ఫిబ్రవరి 15 మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు గురించి వివరించారు. కార్యక్రమంలో…. ధర్మకర్త మండలి సభ్యులు, మాజీ చైర్మన్లు, దేవాదాయశాఖ ఏఈ, గ్రామస్తులు, భక్తులు ఆలయ ధార్మిక సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



