Listen to this article

వికారాబాద్ జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి.

జనం న్యూస్ 10 జనవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు )తెలంగాణ రాష్ట్ర డిజిపి డా.జితేందర్ తెలంగాణ పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయము తెలుసుకోవడానికి నూతనంగా విడుదల చేసిన క్యూఆర్ కోడ్  పోస్టర్ (సిటిజన్ ఫీడ్ బ్యాక్ క్యూఆర్ కోడ్)ను వినియోగించుకొని జిల్లా ప్రజలు పోలీస్ సేవల పైన తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా ఎస్పీ కే.నారాయణ రెడ్డి ఓ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ క్యూ‌ఆర్ కోడ్ పోస్టర్ లను జిల్లాలోని అన్నీ పోలీస్ స్టేషన్లలో, సర్కిల్ కార్యాలయాల్లో, డి.ఎస్పి ఆఫీసులో, ఎస్‌పి ఆఫీసులో  మరియు సోషల్ మీడియా నందు అందుబాటులో ఉంటాయని వివరించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్యూ‌ఆర్ కోడ్ పైన స్కాన్ చేసి వచ్చిన లింక్ ను తెరచి తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఎస్పీ సూచించారు.