

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 4 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : (STU )వ్యవస్థాపకులుకామ్రేడ్ మఖ్దూం మొహియుద్దీన్ 118వ జయంతి.చిలకలూరిపేట పట్టణంలో ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో రాష్ట్ర ఆర్ధిక కార్యదర్శి కే కోటేశ్వరరావు.రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన లో విద్యాఉపాధ్యాయుల హక్కుల ను కాపాడేందుకు,కామ్రేడ్ మఖ్దూం మొహియుద్దీన్ ఇంట్లో సమావేశమై కొద్ది మంది ఉపాధ్యాయుల తో స్వతంత్ర ఉపాధ్యాయ సంఘాన్ని మఖ్దూం నాంది పలికారు.1947 జూన్ 9 వ తేదీ న నాటి ప్రభుత్వ ఉత్తర్వు 1890 ప్రకారం సంఘానికి గుర్తింపు లభించింది.అప్పుడు హైదరాబాద్ స్టేట్ టీచర్స్ యూనియన్ “గా వెలిసిన ఆ సంఘం .ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవతరణ అనంతరం రాష్ట్రోపాధ్యాయ సంఘం.సంఘాన్ని స్థాపించిన కామ్రేడ్. “మఖ్దూం మొహియుద్దీన్” అని అన్నారు. వారు ప్రముఖ ఉర్దూ కవి, కమ్యూనిస్టు మేథావి. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన 04 ఫిబ్రవరి 1908 న మెదక్ జిల్లా ఆందోల్ లో జన్మించారు. నిజాం ప్రభుత్వం లో 29 వ ఏట ఎం.ఎ (MA) డిగ్రీ పొంది ‘సీటి కాలేజ్ ‘ లో అధ్యాపకుడిగా ఉద్యోగం ప్రారంభించారు హైదరాబాద్ లోని అనేక కంపెనీల్లో కార్మిక సంఘాలకు అధ్యక్షుడుయ్యారు.నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ నుండి శాసనసభ కు ఎన్నికయ్యారు.. ఫాసిజానికి వ్యతిరేకంగా, సమసమాజ స్థాపన కోసం క్రియాశీలకంగా ప్రగతి భావాలతో పీడితుల పక్షాన నమ్మిన సిద్దాంతానికి జీవితాన్ని అంకితం చేసినమహనీయులు మఖ్దూం గుర్తుగా 1972ఆగష్టు17న హైదరాబాదు లో “మఖ్దూం భవన్” ప్రారంభోత్సవం జరిగింది. వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక ఉత్తేజం ,కాకలుతీరిన కమ్యూనిస్టు యోధుడు, విప్లవ వీరుడు, ఉద్యమాలకు ఊపిరి, నిరంకుశ పాలనపై గర్జించిన తుపాకీ తూటాఫాసిజం పైఎత్తిన కత్తి, మానవ విలువ లు చాటిచెప్పిన మల్లెల పరిమళం, ప్రేమభావాలకు పట్టం కట్టిన సంగీత తరంగం కలాన్ని కత్తి గా మార్చకున్న ఉద్యమనాయకుడు, ఆయన జీవితమే పోరాటం , పోరాటమే కవిత్వం.అటువంటి మహోన్నత వ్యక్తి యొక్క జీవితం మనందరికీ ఆదర్శం. మన ఉపాధ్యాయులు తమ బానిస సంకెళ్ళు ను తెంచుకొవాలని సూచిస్తూ, నాటి నుండి నేటి వరకు STUAP సంఘాన్ని విజయ పథం లో నడిపిస్తున్న సంఘ కార్యకర్తలకు, నాయకులకు , శ్రేయోభిలాషలకు మనందరికీ వారి జీవితం ఆదర్శప్రాయమని అన్నారు.సమావేశం లో జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య.పట్టణ అధ్యక్షుడు మేకల కోటేశ్వరరావు కార్యదర్శి వద్లాన జయప్రకాష్.పట్టణ నాయకులు ఇనకొల్లు అంకమ్మ రావు. మురికిపూడి. చినవెంకటస్వామి. కుంభా ఏడుకొండలు.యన్.కాలేషా సొమ్లనాయక్,హనుమంతునాయక్ అట్లూరీశ్రీనివాసరావుతదితరులు పాల్గొని వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.