Listen to this article

జనం న్యూస్, డిసెంబర్ 24,అచ్యుతాపురం:

ఎస్ రాయవరం మండలం గుర్రాజుపేట గ్రామంలో హెరిటేజ్ డైరీ పాడి రైతులకు అవగాహన సదస్సును హెరిటేజ్ డైరీ రీజనల్ మేనేజర్ పి తులసి నాయుడు నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పాడి రైతులకు పొలాల్లో మెలకువలు మెలికల గురించి చెప్పడం జరిగింది.హెరిటేజ్ డైరీలో పాలు సరఫరా చేస్తున్నా రైతుల పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ రూ.50 అదే విధంగా ఆడపెయ్య పుట్టుటకు రూ.500 కృత్రిమ గర్భధారణ రైతులకు అందించబడునని తెలిపారు. అంతేకాకుండా హెరిటేజ్ డైరీ పాడి రైతులకు అండగా ఉంటుందని అన్నారు. హెరిటేజ్ డైరీ ఏరియా మేనేజర్ మనోహర్ రైతులందరితో మాట్లాడుతూ హెరిటేజ్ డైరీ జిల్లాలో అన్ని డైరీలు కంటే ఎక్కువ రేటు చెల్లిస్తుందని అదేవిధంగా హెరిటేజ్ డైరీకి పాలు సరఫరా చేస్తున్న పాడి రైతు ప్రమాదంలో చనిపోతే రూ.2 లక్షలు సహజ మరణానికి రూ.50 వేలు హెరిటేజ్ డైరీ కుటుంబం నామినికి అందజేస్తుందని తెలిపారు.హెరిటేజ్ డైరీ రావడం అందరికీ సంతోషంగా ఉందని రైతులు తెలిపారు.ఈ కార్యక్రమంలో హెరిటేజ్ డైరీ మేనేజర్ కూండ్రపు శేషు, ఈ నానిబాబు,శ్రీను,కోటబాబు, నర్సింగరావు,అమ్మాజీ తదితర రైతులు పాల్గొన్నారు.