జనం న్యూస్, డిసెంబర్ 24,అచ్యుతాపురం:
అచ్యుతాపురం మండలంలో 6 గ్రామాల ప్రజలకు పునరావాసం నిమిత్తం కేటాయిం అచ్యుతాపురం మండలం
పూడి ఆర్అండ్ఆర్ కోలనీ పేరుతో 6 గ్రామాలకు చెందిన సుమారు 8 వేలు జనభా కలిగిన ఒక గ్రామంగా ఏర్పడింది.పూడి ఆర్అండ్ఆర్ కాలనీ క్రొత్త ప్రదేశం కావడంతో ఆర్టీసి బస్సులో ప్రయాణించే ప్రతీ ఒక్కరు వెదురువాడ లేదా గొర్లి ధర్మవరం కు టిక్కెట్టు ఇచ్చుచున్నారని,దానివలన సదరు గ్రామ ప్రజలు, స్కూల్ మరియు కాలేజీ విద్యార్ధులు,వృద్ధులు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుచున్నారని,యలమంచిలి-విశాఖపట్నం పోవు ప్రతీ ఆర్టీసి బస్సుకు పూడి ఆర్అండ్ఆర్ కోలనీ వద్ద రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేసి అ పేరు పై టికెట్స్ ఇవ్వాలని కోరుతూ స్థానిక యువ నాయకులు రాజాన సంజీవి గాజువాక ఆర్టీసీ డిపో సిబ్బందికి వినతిపత్రం అందించారు.


