Listen to this article

బి వీరేశం సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ 24 డిసెంబర్

ఈరోజు జహీరాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ కు కలిసి శాలువా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ సందర్భంగా అనంతరం జహీరాబాద్ పట్టణ పరిధిలోని గుల్షన్ నగర్, గాంధీనగర్, సలాం నగర్ కాలనీల్లో నెలకొన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఆయా కాలనీల్లో రోడ్ల నిర్మాణం, నాళీల సదుపాయం, వీధి విద్యుత్ దీపాల ఏర్పాటు అత్యవసరంగా చేయాలని కోరారు. కాలనీల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ విషయాలపై కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.