Listen to this article

నీటిసంఘం అధ్యక్షులు బండారు వెంకన్న బాబు చొరవతో సమస్యకు మోక్షం.

జనం న్యూస్ అమలాపురం 24డిసెంబర్ 2025;

అమలాపురం రూరల్ మండలం సమనస కాసుల కాలవ పూడికతో మూసుకుపోయింది. ఏపుగా పెరిగిన డొంకలతో రైతులు నారుమడులకు నీరు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కిత్తన చెరువు నీటి సంఘం అధ్యక్షులు బండారు వెంకన్నబాబు చొరవ తీసుకుని స్పందించారు. వెంటనే ఆ పూడికని పరిశీలించి జేసీబి సాయంతో కాసులు చెరువు నీటి మార్గం సుగమం చేశారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వెంకన్నబాబు తో పాటు అమలాపురం మండలం మాజీ ఎంపీపీ ఎరుబండి వెంకటేశ్వరరావు,
అమలాపురం డిసి రాజులపూడి భీముడు, రైతులు మామిడిపల్లి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.