

జనం న్యూస్ 05 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఆశ వర్కర్లపై పని భారం తగ్గించాలని సీఐటీయూ జిల్లా జిల్లా కార్యదర్శి జగన్మోహన్ డిమాండ్ చేశారు.
యాఫప్లను రద్దు చేసి పని భారం తగ్గించాలని కోరుతూ విజయనగరం రూరల్, అర్బన్ ప్రాథమిక కేంద్రాల వద్ద ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఆశ కార్యకర్తలతో వెట్టి చాకిరి చేపట్టించుకుని కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. యాప్‌లతో సర్వే చేపట్టించుకుని పని భారం పెంచుతున్నారని విమర్శించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.