మొత్తం ఆదాయం రూ.42,55,555
జనం న్యూస్ డిసెంబర్ 24 సంగారెడ్డి జిల్లా
బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రాంగణంలో బుధవారం బహిరంగ వేలం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేలాన్ని దేవస్థానం ఈవో శశిధర్ గుప్తా, ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, మొత్తం రూ.42,55,555 ఆదాయం లభించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.వేలం వివరాలు ఇలాఉన్నాయి: కొబ్బరికాయల వేలం – రూ.11,05,000లకు శ్రీకాంత్ రెడ్డి ,లడ్డు, పులిహోర వేలం – రూ.9,90,000లకు చంద్రశేఖర్,కొబ్బరి చిప్పల వేలం – రూ.2,55,000లకు రామారావు,జాయింట్ వీల్ వేలం –రూ.17,25,000లకు రత్నం,థాయ్ బజార్ వేలం – రూ.1,50,555లకు నరసింహ చారి లు దక్కించుకున్నారు.భక్తుల నుంచి విశేష స్పందన లభించడంతో వేలం విజయవంతంగా ముగిసిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈ ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేవస్థాన అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం వినియోగించనున్నట్లు ఈవో శశిధర్ గుప్తా తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్ రెడ్డి, సోమేశ్, శివకుమార్‌తో పాటు ధర్మకర్త మండలి సభ్యులు చంద్రశేఖర్, లక్ష్మీకాంతరావు, నిర్మల రమేష్ యాదవ్, ఎల్లయ్య, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్, కుమ్మరి మహేష్, దీపక్ గౌడ్, దేవాదాయ శాఖ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం శాంతియుతంగా కొనసాగింది.


