Listen to this article

గుమ్మడిదలలో సిజిఆర్ ఇంటికి తేనేటి విందుకు హాజరు.

జనం న్యూస్ డిసెంబర్ 24 సంగారెడ్డి జిల్లా రైతుల పక్షాన న్యాయం జరిగేంతవరకు తమ పోరాటం కొనసాగిస్తామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. గుమ్మడిదల మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి నివాసంలో బుధవారం ఆయన తెనేటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 109 సర్వే నంబర్ భూములపై కొనసాగుతున్న వివాదంపై పలువురు రైతులు హరీష్‌రావును కలసి తమ సమస్యలను వివరించారు. రైతుల మాట విన్న ఆయన, రైతులకు జరిగిన అన్యాయాన్ని సరి చేయించేంతవరకు పోరాటం కొనసాగిస్తాం. రైతుల పక్షాన న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటాం,అని హామీ ఇచ్చారు. రైతుల ఆస్తి హక్కులు రక్షించడంలో ఎలాంటి వెనుకడుగు వేయబోమని, అవసరమైతే ఏ స్థాయిలోనైనా పోరాటానికి సిద్ధమని హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, రాష్ట్ర నాయకులుజిన్నారం వెంకటేశం గౌడ్, మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లిప్రభాకర్ రెడ్డి,రాజేష్, స్థానిక నాయకులు శ్రీనివాస్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, హుస్సేన్, సంతోష్ రెడ్డి,నరసింహారెడ్డి,దేవేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, నర్సింగరావు, శ్రీనివాస్, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు, సత్యనారాయణ, శ్రీకాంత్ గౌడ్, బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.