జనం న్యూస్, డిసెంబర్ 24,అచ్యుతాపురం:
సీఐటీయూ అఖిల భారత మహాసభలు సందర్భంగా ఈనెల 27 అనగా శనివారం ఉదయం 6 గంటలకు పూడిమడక రోడ్డులో ఉన్న ప్రశాంతి కాలేజీ నుంచి కొనేంపాలెం వరకు జరుగుతున్న 2కె రన్ లో యువతీ యువకులు,కార్మికులు, ఉద్యోగులు,విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ జెర్సీలు ఆవిష్కరణ చేశారు.రన్ లో పాల్గొన్న వారికి టీ షర్టు,స్నాక్స్ తో పాటు ప్రధమ, ద్వితీయ,తృతీయ స్థానాల్లో విజేతలైన వారికి నగదు బహుమతి అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇసాన్ ఆసుపత్రి డాక్టర్ ధర్మీరెడ్డి వెంకట్, సీఐటీయు మండల కన్వీనర్ కే సోమునాయుడు నిర్వాహకులు ఆర్.అరుణ్,జె అప్పలరాజు, కడారి ఉమాశంకర్, ఎం రమణ కె వంశి తదితరులు పాల్గొన్నారు.


