Listen to this article

జనం న్యూస్: డిసెంబర్ 24 బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్;

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిద్దిపేట రీజనల్ సెంటర్ ప్రారంభమై 40 సంవత్సరాలు పూర్తయింది.ఈ సందర్భంగా స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతుంది . కార్యక్రమం జనవరి 18వ తేదీన జరగనున్నట్లు , ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ గంటా చక్రపాణి హాజరవుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. జి సునీత మరియు రీజనల్ కోఆర్డినేటర్ డా. ఎం శ్రద్ధానంద0 ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ చక్కటి అవకాశాన్ని స్టడీ సెంటర్లో చదివిన విద్యార్థులు అందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు.మిగతా వివరాలకు ఫోన్ నెంబర్లకు సంప్రదించగలరు 9704425028.95810 72143.