జనం న్యూస్ డిసెంబర్ 22: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న హయగ్రీవ పాఠశాలలో గణిత శాస్త్ర పితామహుడుశ్రీనివాస రామానుజన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గణిత ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన గణిత నమూనాలు, ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమానికి ఏర్గట్ల ఎస్.ఐ. పడాల రాజేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, గణితం యొక్క ప్రాధాన్యతను, రోజువారీ జీవితంలో గణితం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో విద్యార్థులకు వివరించారు. గణితంపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచిస్తూ, ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.పాఠశాల సెక్రటరీ & కరెస్పాండెంట్ శ్రీమతి అలివేణి , ఉపాధ్యాయులు ఎస్సైని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.



