Listen to this article

జనంన్యూస్. 24. సిరికొండ. శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు. రురల్.సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ పాఠశాలలో క్రిస్మస్ ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా క్రిస్మస్ ట్రీ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జాకీర్ సినిమా మాట్లాడుతూ…
క్రిస్మస్ అంటే క్రీస్తు జనన పండుగ, దీనిని ఏసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటారు; ఈ పండుగ ప్రేమ, శాంతి, దానధర్మాలకు ప్రతీక, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, ఇళ్లను అలంకరించుకోవడం, క్రిస్మస్ చెట్లు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, శాంతా క్లాజ్ వంటి సంప్రదాయాలతో ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ ఆసిఫ్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.