జనం న్యూస్ 26 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం ఎస్.ఎం.బి చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు విజయనగరం నగరంలోని ప్రముఖ ఎస్.ఎం.బి చర్చిలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, శాంతి మార్గాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. చర్చి నిర్వాహకులు మజ్జి శ్రీనివాసరావును సత్కరించి, దైవాశీస్సులు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు.


