జనం న్యూస్ డిసెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి
భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్ పాయి జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు ఆర్వి నాయుడు అధ్యక్షతన అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని వారికి ఘన నివాళులర్పించారు. బిజెపి సీనియర్ నాయకులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని అటల్ బిహారీ వాజ్పేయి కు నివాళులర్పించారు. యాళ్ల దొరబాబు మాట్లాడుతూ దేశానికి ఆదర్శవంతమైన అటల్ బిహారీ వాజ్పేయి గారి అడుగుజాడల్లో నేటి యువత నడవాలని అన్నారు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు మాట్లాడుతూ గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా ప్రతి పల్లెకు లింకు రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వర్ణ చతుర్భుజి పధకం లో భాగంగా దేశవ్యాప్తంగా ఫోర్ లైన్స్ రోడ్లను విస్తరింప చేసారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పూర్వపు జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీను చిలకమర్రి కస్తూరి చిలకమర్రి సాగర్, వాడపల్లి దేవస్థానం డైరెక్టర్ సిస్ట కుటుంబరావు సుంకర సాయి, కట్ట నారాయణమూర్తి,నల్ల సత్తిబాబు గుమళ్ళ మ్మల రెడ్డి నాయుడు, ఎర్రమిల్లి పాండురంగారావు, కర్రీ తాతారావు,గోనుమడతల కనకరాజు,పరబతులుల బత్తుల సుబ్బారావు కట్ట జనార్ధన్,అరిగెల తేజ వెంకటేష్,ఆకుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.


