Listen to this article

జనం న్యూస్ 26డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా

స్టాఫ్ఫర్. జైనూర్ :యేసుక్రీస్తు జననం పురస్కరించుకొని జైనూర్ మండల కేంద్రం లోని ట్రూ ఫ్రెండ్స్ బాప్టిస్ట్ చర్చ్ ని ఆత్మీయులు అందంగా అలంకరించి,చర్చ్ పైన స్టార్స్ ధరింంప చేసి,భక్తులు చిన్న,పెద్దల తో యేసుక్రీస్తు జననం గురించి తెలుగు, గోండి భాషలోఆరాధన ఆనందం లో పాటలు పాడినారు, బైబిల్ నుండి క్రిస్మస్ సందేశం స్థానిక పాస్టర్ కంటె ఏలియా, మానవాళికి శాంతి, సమాధానం ఇవ్వడానికి తన ప్రజలను పాపములనుండి రక్షించుటకు యేసు జన్మించాడని బోధించాడు.పరిశుద్ధ గ్రంధం నుండి: మత్తయి 1:18-25.ఆదికాండము 1:1,2:7.యోహాను 1:1-12బైబిల్ చదివి వినిపించారు. క్రిస్మస్ సందర్బంగా చర్చ్ లో భక్తులకు కేక్ కట్ చేసి ఒకరికిఒకరు కేక్ తినిపించారు. చలి తీవ్రతను బట్టి క్రిస్మస్ సందర్బంగా స్థానిక పాస్టర్ మరియు పాస్టర్ అమ్మ కంటె మేరి (లక్ష్మి )నిరుపేదలకు దుప్పట్లు, పండ్లు, అనాధలకు క్రొత్త డ్రెస్స్ లు, నోట్ బుక్స్ పెన్నులు పెన్షల్స్ ఆపిల్స్ పంపిణి చేసి దేవుని ప్రేమ చాటారు.