

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 05 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా సారిపల్లిలోని పోలీసు శిక్షణ కేంద్రంను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఫిబ్రవరి 4న ఆకస్మికంగా సందర్శించి, శిక్షణ కేంద్రంను, మౌళిక వసతులను ఫిబ్రవరి 4న పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – సారిపల్లిలోని పోలీసు శిక్షణ కేంద్రంలో
అవసరమైన మౌళిక వసతులను కల్పిస్తామన్నారు. ప్రస్తుతం పోలీసు కానిస్టేబుళ్ళ వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చే శిక్షణకార్యక్రమంలు కొనసాగుతున్నాయన్నారు. పోలీసు శిక్షణ కేంద్రంలోని తరగతి గదులను, కార్యాలయం, వంట గది, డైనింగు హాలు, స్టోరు రూం, వాష్ రూంలను, స్నానపు గదులను, మినరల్ వాటర్ ప్లాంట్, లైబ్రరీ, పరేడ్ గ్రౌండు,ఫైరింగు రేంజ్ లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. శిక్షణ కేంద్రం ప్రారంభంలో కల్పించిన మౌళిక వసతులను పరిశీలించి, వాటికి అదనంగా శిక్షణకు అవసరమైన వసతులను కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. శిక్షణ కేంద్రంలో మంచాలు, పరుపులు, క్రీడా సామగ్రి, టేబుల్స్, కంప్యూటర్లు, ఫ్యానుల పని తీరును డిటిసి అధికారులను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కేంద్రంలో సుమారు 200మంది పోలీసు కానిస్టేబుళ్ళు శిక్షణ పొందేందుకు అవసరమైన నిర్మాణాలను గతంలోనే చేపట్టినట్లుగా అధికారులు జిల్లా ఎస్పీకి వివరించారు. శిక్షణ కేంద్రంలో ప్రధానంగా మంచినీటి సమస్య ఉన్నట్లుగా అధికారులు జిల్లా ఎన్పీ దృష్టికి తీసుకొని రాగా, శిక్షణ కేంద్రంకు అవసరమైన మంచి నీటి వసతిని
కల్పించేందుకు మున్సిపల్ అధికారులతోను ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి, చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.జిల్లా ఎస్పీ వెంట ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, భోగాపురం రూరల్ సిఐ జి.రామకృష్ణ, డిటిసి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.