Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ముమ్మిడివరం మండలం ముమ్మిడివరం గ్రామంలో బీజేపీ పూర్వపు పార్లమెంట్ కన్వీనర్ మండల ఇంచార్జ్ ఇళ్ల సత్యనారాయణ, సమక్షంలో ఈ కార్యక్రమం డి శ్రీనివాస్ అధ్యక్షతన విష్ణు ఆలయంలో అటల్ బిహారి వాజపేయ్ వారి శత జయంతి ఉత్సవం, భాగంగా ముమ్మిడివరం నియోజకవర్గ సమావేశం గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముమ్మిడివరం మార్కెటింగ్ యాడ్ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇళ్ల సత్యనారాయణ మాట్లాడుతూ భారత దేశ రాజకీయాలలో భీష్మ పితామహుడు వాజ్ పేయి అని అన్నారు. రాజనీతజ్ఞడుగా, రాజకీయాలలో అజాతశత్రువు అనే గుర్తింపు ఆయనకు ఉంది. ఆయన హయాం లో జరిగిన పోక్రాన్ అణు పరీక్షలు, స్వర్ణ చతుర్భుజి రహదారుల నిర్మాణం, గ్రామీణ రోడ్ల అభివృద్ధి లాంటి కార్యక్రమాలు భారతదేశ గమనాన్ని మార్చేశాయన్నారు. దేశానికి వాజ్ పేయి చేసి సేవలు చిరస్మరణీయం అన్నారు. సర్వ శిక్ష అభియాన్ ద్వారా ప్రతి గ్రామంలో పాఠశాలలు నిర్మించే కార్యక్రమం చేపట్టారన్నారు. గ్రామీణ ప్రాంతాలలో లింక్ రోడ్లు వేయించిన ఘనత, జాతీయ రహదారులను అభివృద్ధి చేసి స్వర్ణ చతుర్భుజి ఏర్పాటు చేశారన్నారు. వాజ్‌పేయిని స్ఫూర్తిగా తీసుకుని నాయకులందరూ కష్టపడి పనిచేయాలన్నారు.అనంతరం ముఖ్య అతిధికి గొల్ల కోటి వెంకటరెడ్డి మరియు ముమ్మిడివరం టౌన్ ఇంచార్జ్ ఇళ్ల సత్యనారాయణ ఘనంగా సన్మానించినారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ సీనియర్ నాయకులు బసవా హరి బాబు,, , సకిరెడ్డి శ్రీనివాస్ ఐ పోలవరం మండల బీజేపీ అధ్యక్షులు, ఉద్దిశ సూరి బాబు , సన్నిధిరాజు వీరభద్ర శర్మ , పుల్లెల శాస్త్రి , జనిపెళ్ళ శ్రీనివాస్ రావు , రాయుడు గంగా శివకుమార్, దొమ్మేటి బాలరాజు , గుత్తుల రాంమోహన్ , తటవర్తి నాగరాజు , రాయపురెడ్డి భైరవమూర్తి , కర్రి కృష్ణమూర్తి, శ్రీమతి పెనుమాల దుర్గబాయి, చొల్లంగి శివ కుమార్, కుడిపూడి దుర్గాప్రసాద్ మొ ” వారు పాల్గొని జయప్రదం చేసారు, వాజపేయ్ గారి గొప్పతనం, అనర్గాల ప్రసంగికుడు అని, దేశ వ్యాప్తంగా షాద్భుజి జాతీయ రహదారుల నిర్మాణ కర్త, అటమ్ బాంబ్స్ పరీక్షలు నిర్వహించిన దీరోద్దతుడు అని పేర్కొన్నారు