

జనం న్యూస్ 05 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
భీమా రంగంలో విదేశీ ప్రత్యక్షపెట్టబడులు పెంచడం అవాంఛనీయమని ఎల్‌ఐసి ఉద్యోగులు సంఘం అధ్యక్షులు ఎల్ తిరుమలరావు అన్నారు. మంగళవారం విజయనగరం ఎల్‌ఐసి కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ… ఆర్థికశాఖా మంత్రి బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74% కు పెంచుతున్నట్లు ప్రకటించడం భారత ఆర్థిక వ్యవస్థకు, జీవిత బీమా రంగానికి నష్టమన్నారు. దీనిని విరమించుకోవాలని కోరారు.