జనం న్యూస్ డిసెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, కార్యక్రమం కో కన్వీనర్ గనిశెట్టి వెంకటేశ్వరరావు అధ్యక్షతన పి.గన్నవరం నియోజకవర్గ సమావేశం గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ రాజకీయాలలో భీష్మ పితామహుడు వాజ్ పేయి అని అన్నారు. రాజనీతజ్ఞడుగా, రాజకీయాలలో అజాతశత్రువు అనే గుర్తింపు ఆయనకు ఉంది. ఆయన హయాం లో జరిగిన పోక్రాన్ అణు పరీక్షలు, స్వర్ణ చతుర్భుజి రహదారుల నిర్మాణం, గ్రామీణ రోడ్ల అభివృద్ధి లాంటి కార్యక్రమాలు భారతదేశ గమనాన్ని మార్చేశాయన్నారు. దేశానికి వాజ్ పేయి చేసి సేవలు చిరస్మరణీయం అన్నారు. సర్వ శిక్ష అభియాన్ ద్వారా ప్రతి గ్రామంలో పాఠశాలలు నిర్మించే కార్యక్రమం చేపట్టారన్నారు. గ్రామీణ ప్రాంతాలలో లింక్ రోడ్లు వేయించిన ఘనత, జాతీయ రహదారులను అభివృద్ధి చేసి స్వర్ణ చతుర్భుజి ఏర్పాటు చేశారన్నారు. వాజ్‌పేయిని స్ఫూర్తిగా తీసుకుని నాయకులందరూ కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అయినవిల్లి మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ, అంబాజీపేట మండలం అధ్యక్షులు కముజు శ్రీనివాస్, మామిడికుదురు మండలాధ్యక్షులు బైరిశెట్టి రామకృష్ణ, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పసుపులేటి మహాలక్ష్మి రావు, సీనియర్ నాయకులు చెరుకూరి గోపాలకృష్ణ, మహిళా మోర్చా రాష్ట్ర సీనియర్ నాయకురాలు ఆకుమర్తి బేబీ రాణి,జిల్లా కార్యదర్శి మోకా ఆదిలక్ష్మి, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు గాడి సత్తిబాబు, పీఏసీఎస్ డైరెక్టర్ మిద్దె నూతన రవి రాజ్, మండల ప్రధాన కార్యదర్శిలు సరెళ్ళ దాస్, మొగలి దుర్గారావు, సీనియర్ నాయకులు వేటుకూరి ప్రసాద్ రాజు, వెతుకూరి శ్రీనివాసరాజు, మండల ట్రెజరర్ మల్లాది సూర్య మల్లికార్జున రావు, బూత్ అధ్యక్షులు బుట్టె సత్యనారాయణ, కిసాన్ మోర్చా నాయకులు నల్లా సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.



