Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బీ వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 26

పూర్తికాగానే ప్రజాసేవకు శ్రీకారం చుట్టారు. గ్రామ ప్రజలు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో సర్పంచ్ ఈశ్వర్ తన సొంత డబ్బులతో రెండు బోర్లను వేయించి వెంటనే నీటి సరఫరాను ప్రారంభించారు. ప్రమాణస్వీకారం చేసిన తక్షణమే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం గ్రామంలో హర్షాతిరేకాలను వ్యక్తం చేసింది. తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు స్వచ్ఛమైన నీటిని అందించడం తన తొలి ప్రాధాన్యతగా భావిస్తున్నానని ఈ సందర్భంగా సర్పంచ్ సమ్మన్ గారి ఈశ్వర్ తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే తన పాలన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సర్పంచ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు హర్షిస్తూ అభినందనలు తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతానని, గోపన్పల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సర్పంచ్ ఈశ్వర్ హామీ ఇచ్చారు.