Listen to this article

జనం న్యూస్ 26 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

ఈ ఏడాది మార్చి 12వ తేదీన పార్లమెంట్ సమావేశాలలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటును ప్రస్తావించిన ఎంపీ డీకే అరుణ. మహబూబ్ నగర్ పార్లమెంట్ లోని మక్తల్,కొడంగల్ నియోజకవర్గాలతో పాటు జోగులాంబ గద్వాల పట్టణ కేంద్రంలో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలనీ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన ఎంపీ డీకే అరుణ.ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్డకల్ మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి స్థలాన్ని కేంద్ర ప్రతినిధుల బృందం,రాష్ట్ర ఉన్నతాధికారులు పరిశీలించి,ఎంపిక ఖరారు చేశారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన సమయంలో అనువైన ప్రదేశం, మౌలిక సదుపాయాలు, పర్యావరణ అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారని అన్నారు. జిల్లా అధికారులు, కేంద్ర ప్రతినిధులు కలిసి జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్డకల్ లో పర్యటించి విద్యార్థుల సౌకర్యార్థం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అనువైన స్థలాన్ని పరిశీలించి, ఎంపిక చేశారు. కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు స్థల ఎంపిక గొప్ప ముందు అడుగు అని ఎంపీ డీకే అరుణ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర విద్య శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి జిల్లాలో కేంద్రీయ విద్యాలయల ఏర్పట్లు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.