జనం న్యూస్ 27 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా సంతకవిటి(మండలం) మోదుగులపేటకు చెందిన యువతి గాదె రేణుక సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి లేడీ డాన్ అవతారమెత్తింది. ముఠాను రెడీ చేసుకుని గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు చిక్కింది. అనకాపల్లి(జిల్లా) నర్సీపట్నంలో వాహన తనిఖీలు చేపట్టగా గంజాయి తరలిస్తున్న రేణుకతోపాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.18.50 లక్షల విలువైన 74 కేజీల గంజాయి, కారు, రెండు స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు.


