Listen to this article

జనంన్యూస్. నిజామాబాదు. ప్రతినిధి : నిజామాబాదు రూరల్ సిరికొండ.రూరల్ కాంగ్రెస్ నాయకుడు ఉమ్మజి నరేష్ మాట్లాడుతూ. రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ దేశంలో ఎక్కడా లేని విధంగా కులగనన చేపట్టి నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులాలవారీగా లెక్క తేల్చేసి బీసీలకు రానున్న రోజుల్లో అత్యధికంగా సీట్లురిజర్వేషన్ పరంగా కేటాయించనున్నట్లు తెలిపారు.త్వరలో జడ్పిటిసి.ఎంపిటిసి. సర్పంచి ఎలక్షన్లు వస్తున్న తరుణంలో నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేసి బే షరతులకు పోకుండా పార్టీ ఎవరికీ బి ఫామ్ ఇచ్చి నియమించిన కష్టపడి గెలిపించి వందకు వందశాతం కాంగ్రెస్ జెండా ఎగరవేసి కాంగ్రెస్ తన సత్తా చాటుతుందని. ఎమ్మెల్యే భూపతిరెడ్డి.నాయకత్వంలో తిరుగులేని పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు