Listen to this article

జనం న్యూస్ 27 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

పెట్టుబడిదారీ వ్యవస్థకు కాలం చెల్లింది అది కొందిరి కోసమే పుట్టి అంతరాలను సృష్టించే వ్యవస్థ. నేడు ఆర్థిక అసమానతలతో కమ్యూనిజం వైపు చూస్తున్న యావత్ ప్రపంచం. సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు
ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థకు కాలం చెల్లిందని,ఇది కొందరి ప్రయోజనాల కోసమే పుట్టి అంతరాలను సృష్టిస్తుందని దీనికి కమ్యూనిజమే ప్రత్యామ్నాయంగా ఎర్రజెండా వైపు చూస్తున్న యావత్ ప్రపంచం అని సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు అన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత వార్షికోత్సవాల ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా గద్వాల జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం ముందు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పేరు కృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై సీపీఐ జెండాను ఎగరవేశారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని కారల్ మార్క్స్ కనుగొన్నాడని ఆ సిద్ధాంతమే ప్రపంచంలో దోపిడీ నుండి మానవాళి విముక్తికి మార్గం చూపిందన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ రోజు రోజుకు సంక్షోభంలో..కూరుకుపోతున్నదని,పెట్టుబడిదారీ వ్యవస్థ పతనంతో ప్రపంచ ప్రజలు కార్మికులు యువత ప్రత్యామ్నాయంగా ఎర్ర జెండా వైపు చూస్తున్నదని తెలిపారు.భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు డిసెంబర్ 26 కు పూర్తి చేసుకుంటున్నదని తెలిపారు. జాతీయ ప్రజాతంత్ర విప్లవం లక్ష్యంగా, సోషలిజం ధ్యేయంగా, సామాజిక న్యాయం లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో సిపిఐ అనేక త్యాగాలు చేసిందని, ఎంతోమంది అమరవీరులను అందించిన చరిత్ర సిపిఐదని అన్నారు.దున్నే వాడికి భూమి దక్కాలని, భూమిలేని నిరుపేదలకు భూమి పంచాలని పోరాడి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిందని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని చేపట్టి వేలాది గ్రామాలను విముక్తి చేసిన ఘన చరిత్ర సిపిఐకి మాత్రమే ఉందన్నారు. దేశంలో వామపక్ష పార్టీల ఐక్యతా పోరాటాలను ఉధృతం చేస్తూ, లౌకిక ప్రజాస్వామిక శక్తుల్ని ఏకం చేస్తూ ప్రజాస్వామ్య పోరాటాలను నిర్వహించడం జరుగుతున్నదన్నారు. ప్రపంచంలో కమ్యూనిజం తప్ప మరే సిద్ధాంతం గాని, వ్యవస్థలు, పార్టీలు గాని అవి అందరిని సమానంగా చూడవని ప్రేమించవని, మానవాళి మనగడకు కమ్యూనిజ మోక్కటే ఏకైక మార్గమని ఉద్గటించారు. భవిష్యత్తులో కొందరి ప్రయోజనాలకై పుట్టిన పెట్టుబడిదారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించి అందరికీ సమానత్వం అందించే కమ్యూనిజం వైపు పోయే మార్గాలకై మరింత శ్రమించాలని సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగాపిలుపునిచ్చారు.ఈ సందర్బంగా పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆశన్న రంగన్న మండల కార్యదర్శి ఖాసీం మండల సహాయ కార్యదర్శి వెంకటేష్ పట్టణ సహాయ కార్యదర్శి నారాయణ,ఖాదర్ బాషా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కృష్ణ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నాయకులు వెంకట్రామిరెడ్డి,లారీ హమాలి కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు వెంకట రాములు, వెంకటేష్ ట్రాన్స్పోర్ట్ హమారీ కార్మిక సంఘం వెంకట్ రాములు బైక్ రిక్షా కార్మిక సంఘం నాయకులు ధర్మన్న శివారెడ్డి ఏఐటీయూసీ ఆటో యూనియన్ నాయకులు సిపిఐ పట్టణ నాయకులు నర్సింగ్ రావు విద్యార్థి సంఘం నాయకులు భరత్ రైతు సంఘం లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు