Listen to this article

జనంన్యూస్. 27.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

సిరికొండ మండల కేంద్రం లొని రావూట్ల గ్రామపంచాయతీ పార్దిలోని హైస్కూల్ . మరియు ప్రైమరీ స్కూల్ ను నూతన పాలకవర్గం సర్పంచ్ కోడిగేలా రాజుకుమార్. ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మరియు వార్డ్ మెంబర్ సతీష్. ఆకస్మికంగా స్కూలుకు వెళ్లి తనిఖీ చేసారు పిల్లలకు అందుతున్న విద్య సౌకర్యాల గురించి మరియు మధ్యాహ్న భోజనం గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలతోనూ సరదాగా కాసేపు గడిపార్ అనంతరం పిల్లలను మధ్యాహ్న భోజనం గురించి పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు పిల్లలను ప్రశ్నలు అడగగా టక్కుమని సమాధానం ఇచ్చారు ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు ఎడ్యుకేషన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా పిల్లలను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ముఖ్యంగా ఆటల పోటీలలో జిల్లాస్థాయి క్రీడాకారులను తయారు చేయాలని త్వరలోనే స్కూలుకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ తెలియజేశారు ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తాము తప్పకుండా స్కూలుకు అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు.