Listen to this article

కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

జైనూర్: జైనూర్ మండలం జంగాం గ్రామంలో సర్పంచ్ పెందూర్ అనసూయబాయి–అర్జున్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది. గ్రామ ప్రజలంతా ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీలో చేరి జంగాం గ్రామాన్ని పూర్తిగా కాంగ్రెస్ మయంగా మార్చారు.ఈ కార్యక్రమంలో జనసేన అసోసియేషన్ యూత్ అధ్యక్షుడు సయ్యద్ ఇర్ఫాన్‌తో పాటు గ్రామ యువత, పలువురు బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు,మహిళలు,గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పాల్గొని నూతనంగా చేరిన వారందరికీ పార్టీ కండువాలు వేసి ఘనంగా ఆహ్వానించారు.అంతకముందు గ్రామానికి వచ్చిన సుగుణక్కకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.కొంరం సూరు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ..జంగాం గ్రామ ప్రజలు మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరటం చారిత్రాత్మక ఘట్టమని, ఇది ప్రజలకు కాంగ్రెస్‌పై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ అని, అట్టడుగు వర్గాలు బలోపేతం అయితేనే దేశం బాగుపడుతుందని స్పష్టం చేశారు.బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ప్రజలను విభజించి పాలిస్తున్నాయని, బీఆర్‌ఎస్ అబద్దాల పార్టీ అని, బీజేపీ ఆదివాసీ చట్టాలను నిర్వీర్యం చేసే పార్టీగా మారిందని తీవ్ర విమర్శలు చేశారు.జంగాం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. గ్రూప్ రాజకీయాలు కాకుండా గుడ్ రాజకీయాలు చేయాలని, గుడ్ లీడర్‌గా పేరు తెచ్చుకోవాలని సూచిస్తూ, డీసీసీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సయ్యద్ సజ్జద్,జనసేన యూత్ ఉపాధ్యక్షుడు ఇగిలే జైరామ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జంగాం గ్రామం కాంగ్రెస్ కోటగా మారిందని చాటిచెప్పారు.