జనం న్యూస్ 27 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
29న జరిగే అసెంబ్లీని ముట్టడిస్తాము బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు. బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య అవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతికూర్ రహమాన్. హైదరాబాద్ లోని కాచిగూడ లోని అభినందు గ్రాండ్ లో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయించడం జరిగింది.ఈరోజు హైదరాబాదులోని కాచిగూడ అభినందన్ గ్రాండ్ హోటల్లో జరిగిన బిసి రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో గద్వాల నుంచి టిఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులు పాల్గొన్నారు సమావేశంలో బీసీలకు ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్లను అమలుపరిచే దాకా వదిలిపెట్టే సమస్య లేదని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో అనేక హామీలు ఇచ్చి హామీలను తుంగలో తొక్కుతున్నదని స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించి కోర్టుతో కొట్టి వేయించారని ఇదంతా అగ్రవర్ణాల నాటకంగా కుట్రగా బీసీలు గుర్తించాలని అన్నారు నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే ప్రభుత్వపరంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే అవకాశాలు ఎన్నో ఉన్నాయని కార్పొరేషన్లలో కాంట్రాక్టర్లు ఇతర అనేక అంశాల్లో కోర్టు పరిధిలోకి రాని విషయాలను అమలుపరచవచ్చని కానీ నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్నారని ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనేక పదవులను అగ్రవర్ణాలకే కట్టబెట్టిన విషయాన్ని బీసీలు గమనించాలని చిత్తశుద్ధి లేని రేవంత్ ప్రభుత్వం మరో డ్రామాకుతో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెబుతూ స్థానిక సర్పంచుల ఎలక్షన్ల లాగే మండల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను జరిపించడానికి రిజర్వేషన్లు అమలు చేయకుండానే జరిపించడానికి కుయుక్తులు పన్నుతున్నారని బీసీ నాయకులు ఆరోపించారు బీసీ రిజర్వేషన్లను అమలుపరిచేద్దాక వదిలిపెట్టేది లేదని 29న జరిగే అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ మాజీ అసెంబ్లీ స్పీకర్ మధు సూదనాచారి మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గుజ్జ కృష్ణ నారగోని, రఫీ తదితరులతోపాటు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు


