Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం, కుండలేశ్వరం గ్రామంలోని శ్రీ కుండలేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు సహకరించిన దాతలకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు
దాట్ల సుబ్బరాజు , అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఆలయ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి అవసరమైన గ్రాంట్లు, సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు.
అన్నదానానికి సహకరించిన దాతల సేవాభావాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో దాతలు మరియు ఎక్స్ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద ,ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అశోక్ నాగిడి నాగేశ్వరరావు తవటపల్లి నాగభూషణం, శ్రీను, గ్రామస్తులు కూటమి పాల్గొన్నారు