

✍️జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 5 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ✍️అర్హులైన ప్రతి ఒక్కరికీ నివేశన స్థలాలు అందేవరకు సీపీఐ పోరాటంసీపీఐ జిల్లా కార్యదర్శి ఎ మారుతీ వరప్రసాద్
చిలకలూరిపేట:అర్హులైన ప్రతి పేదవారికి నివేశన స్థలాలు అందేవరకు సీపీఐ అండగా నిలుస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ మారుతీ వరప్రసాద్ చెప్పారు. అర్హులైన పేదలందరికీ నివేశన స్థలాలు అందజేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద పట్టణ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది ప్రజలతో తహశీల్దార్ కార్యాలయంలో ఆర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మారుతీవరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నివేశన స్థలాలు ఇస్తామని ప్రకటించిందని అయితే లబ్దిదారుల ఎంపిక, నివేశన స్థలాల కోసం స్థల సేకరణ తదితర అంశాలపై ఇంతవరకు కార్యాచరణ ప్రకటించలేదన్నారు. సీఎం చంద్రబాబు పేదలకు ఇచ్చిన హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో వారికి రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 3సెంట్లు స్థలాలు ఇవ్వాలని, ఇందుకు సంబంధించి కార్యచరణ వేగవంతం చేయాలన్నారు. సంవత్సరాల తరబడి పేదలు అద్దె ఇళ్లలో మగ్గుతున్నారని, చాలిచాలనీ ఆదాయంతో కుటుంబాలు గడవడమే కష్టంగా మారాయని, ఇటువంటి తరుణంలో ఇంటి అద్దెలు చెల్లించటం పేదలకు మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరల దృష్ట్యా పేదల గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం చే యాలని, ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం పట్టణాలు, గ్రామాలకు దూరంగా నివేశ యోగ్యం కాని ప్రదేశాలలో సెంటు స్థలం కేటాయించారని విమర్శించారు.ప్రజా సమస్యలపై పోరాడటాం…మండుటెండను సైతం లెక్కచేయకుండా వందలాది మహిళలు నివేశన స్థలాల అర్జీలు అందజేయటానికి తరలివచ్చారు. పార్టీల పేరుతో తమకు నివేశన స్థలాలు అందకుండా చేశారని, అర్హత ఉన్నాతమకు నివేశన స్థలాలు అందజేయలేదని వాపోయారు. తమకు ప్రభుత్వం ప్రకటించిన గ్యాస్ డబ్బులు పడలేదని, కరెంటు చార్జీలు ఎక్కువగా వస్తున్నాయని, అర్హత ఉన్నా ఫించన్లు అందటం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీవర ప్రసాద్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల పక్షాన వారి సమస్యలపై పోరాడటానికి సీపీఐ సిద్దంగా ఉందన్నారు. అర్హత ప్రతి ఒక్కరికీ పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు అందేజేయాలన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం సీపీఐ ప్రజల తరుఫున పోరాడుతుందని, ప్రజలు ఏ సమస్య ఉన్నా పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు అందజేయాలని సూచించారు. నివేశన స్థలాల సమస్యపై ఈ నెల 10వ తేదీన నరసరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అర్జీల అందజేత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిలకలూరిపేట పరిసర ప్రాంతాల నుంచి అర్హతగల పేద ప్రజలు అర్జీలతో కార్యక్రమానికి తరలిరావాలని, సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, ఇచ్చిన హామీని త్వరగా పరిష్కరించే విధంగా ఆందోళన చేద్దామని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్, ఏరియా ఇన్‌చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, నాయకులు చౌటు పల్లి నాగేశ్వరరావు, కందిమళ్ల వెంకటేశ్లర్లు తదితరులు పాల్గొన్నారు.