జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్ ని మండల ఉన్నతాధి కారులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసిన మండల పరిషత్ అధ్యక్షులు మేడ విజయ భాస్కర్ రెడ్డి . ఈ సందర్భంగా ఆయన విద్యార్థినిలతో మాట్లాడి వాళ్ల రోజువారి దిన చర్య గురించి , వాళ్లకు అందుతున్న పౌష్టికాహారం మరియు దాని నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ పరిసర ప్రాంతాలను పరీక్షించి దోమలు లోనికి రాకుండా నెట్లు బిగించాలని గేటుకు తాళాలు వేసి విద్యార్థినులు అనుమతి లేకుండా బయటకు వెళ్లే ప్రక్రియను నివారించాలని సూచించారు, విద్యార్థులు దినచర్యలో భాగంగా శుభ్రత పరిశుభ్రత ఏ విధంగా అలవాటు చేసుకోవాలో తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో, ఎంపీటీసీ సోమిశెట్టి సునీత ప్రభాకర్, వైస్ ఎంపీపీ నాయనపల్లి అనుదీప్ జై సింహ, మండల కోఆప్షన్ సభ్యులు కలియుముల్లా ఖాన్ పాల్గొనడం జరిగినది.


