జనం న్యూస్ 28 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
జియ్యమ్మవలస (మండలం) చింతలబెలగాంలో మృతదేహం తవ్వి తీసిన అమానుష ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో దళితులకు స్మశాన వాటిక లేకపోవడంతో ఇటీవల ఓ మృతదేహాన్ని రోడ్డు పక్కన పాతిపెట్టారు. పాతిపెట్టిన స్థలానికి సంబంధించిన రైతు అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ఆదేశాల మేరకు రాత్రికి రాత్రే మృతదేహాన్ని వెలికి తీసి మరోచోట పూడ్చిపెట్టారు. స్మశాన వాటిక లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన చేశారు.


