

నిజం తెలుసుకోకుండా వెళ్లడం నాది తప్పే..
▪️ దళిత నాయకుడు అంబాల రాజు..
జనం న్యూస్ //ఫిబ్రవరి 5//జమ్మికుంట //కుమార్ యాదవ్..
గత కొద్ది రోజులుగా, కాటిపల్లి లక్ష్మి సంబంధించిన ఆరు గుంటల భూమి.. విషయంలో.. పోలీస్ మరియు రెవెన్యూ యంత్రాంగాన్ని తప్పు పట్టిన.. షేక్ సాబీర్ అలీ.. మరియు అంబాల రాజు.. ఇప్పుడు నాది తప్పే అంటున్న.. దళిత నాయకుడు … అంబాల రాజు మాట్లాడుతూ.. కాటేపల్లి లక్ష్మికి సంబంధించిన ఆరు గుంటల భూమిలో.. వారి గురించి నిజానిజాలు తెలుసుకోకుండా,నేను వేళ్లాను.నా దగ్గరికి వచ్చి నన్ను పక్కదారి పట్టించడం జరిగింది అని అన్నారు. వారు నన్ను ఒక దళిత సంఘం నాయకుడిగా మీ మద్దతు కావాలని వారు నా దగ్గరికి రావడం జరిగిందని తెలిపారు. నేను నిజ నిజాలు తెలుసుకోకుండా వారికి మద్దతు ఇవ్వడం జరిగింది అని, వివరించారు. నేను పోలీస్ రెవెన్యూ యంత్రాంగంపై, తప్పుడుగా మాట్లాడడం, జరిగింది అని, అది నా పొరపాటు అని, తెలియజేశారు. అసలు నిజం తెలిశాక నేను చాలా బాధపడుతున్నానని విచారించారు. షేక్ సాబీర్ మరియు కాటిపల్లి రాజు ఒత్తిడి మేరకే, ఫోన్లో నన్ను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది అని, అందుకే వారికి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అని మాట్లాడారు. నేను ఎందుకు ఇలా చేశాను అని బాధపడడం, భయపడడం జరిగింది అని విచార గాధతో వివరించారు. ఇకపై పూర్తిస్థాయిలో వారికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని తెలిపారు.