

జనం న్యూస్ పిబ్రవరి 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం లోన్ వెల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో కొత్తపల్లి వెంకటలక్ష్మి- చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేసి, పాఠశాల ఆవరణలో చెట్లు నాటారు.అనంతరం వారు మాట్లాడుతూ గురువును దేవుడితో సమానంగా చూస్తూ గురువులను గౌరవించడం మన భారతీయ సంప్రదాయంఅని జీవితంలోని అత్యంత క్లిష్టమైన అంశంలో విద్యార్థి జీవితం క్రమశిక్ష అనేది ముఖ్యపాత్ర పోస్తుంది . విద్యలో నియమాలకు కట్టుబడి క్రమశిక్షణ ముఖ్యం పాఠశాల విద్యతో పాటు విద్యార్థులను తరగతిగదిలో క్రమశిక్షణను అభ్యసించాలి మరియు అది లేకుండా వారు బాగా అభివృద్ధి చెందలేరు క్రమశిక్షణ అనేది నిర్ణీత సమయంలో ఏదైనా చేయగల తేడా ఒక పనిని పూర్తి చేయగలం అనే ధైర్యాన్ని ఇస్తుంది తమ జీవన శైలిలో ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకై పాటుపడాలని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టు నాటి పర్యావరణ పరిరక్షణను కాపాడాలని కోరారు, కొత్తపల్లి వెంకటలక్ష్మి- చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ వారి ఆధర్వంలో ఐదు అంశాలపై సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అందులో 1)కిమ్స్ మల్టీస్పెషల్టి హాస్పిటల్ లో పేదలకు రాయితో కూడిన వైద్యం 2)విద్యార్థుల కు మెరిట్స్ స్కాలర్షిప్ 3) పాఠశాల విద్యార్థులకు అవసరమైన సామాగ్రి 4) పర్యావరణ పరిరక్షణ 5) మహిళలకు ఉపాధి, వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు, అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అవధూత చంద్రశేఖర్, మరియు రేవూరి నర్సింహా రెడ్డి హేమాజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
