జనం న్యూస్ 29 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
అర్ధరాత్రి వేళ ఎలమంచిలి సమీపంలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. వెంటనే రైలు ఆపేయడంతో ప్రయాణికులు బోగీల నుంచి దిగి పరుగులు తీశారు. ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మంటలు స్టార్ట్ అయిన వెంటనే ఓ వ్యక్తి గుర్తించి చైన్ లాగడంతో రైలు నిలిపారు. ఆ వ్యక్తి గుర్తించకుండా ఉంటే ఈ ప్రమాదంలో అందరూ సజీవంగా దహనమయ్యే పరిస్థితి ఉండేది.


