జనం న్యూస్ 29 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
చీపురుపల్లి నియోజకవర్గం, గుర్ల మండలం, జమ్ము గ్రామంలో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంలో తన చేతిని కోల్పోయిన జమ్ము వెంకట అప్పలనాయుడును *ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)* ఈరోజు పరామర్శించారు.నేరుగా బాధితుడి స్వగ్రామానికి చేరుకున్న చిన్న శ్రీను, అప్పలనాయుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రస్తుతం అందుతున్న వైద్యం గురించి కుటుంబ సభ్యులతో చర్చించారు. అనూహ్యంగా జరిగిన ఈ ప్రమాదం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. బాధితుడు అప్పలనాయుడు కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో..వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి కెవివి సూర్యనారాయణ రాజుగారు, ఎంపీపీ ప్రతినిధి సన్యాసినాయుడు , జడ్పిటిసి శీర అప్పలనాయుడు , స్థానిక సర్పంచ్ నరసింహ మూర్తి , ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


