జనం న్యూస్ 29 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా శ్రీరాములు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా నియామక పత్రం ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగినది.గట్టు మండల సర్పంచ్లు సంఘం నూతన కార్యవర్గం. అధ్యక్షుడిగా : శ్రీరామ్ గౌడ్ బస్సా పురం గ్రామ సర్పంచ్. ఉపాధ్యక్షుడిగా : రాజు తుమ్మల చెరువు గ్రామ సర్పంచ్ ప్రధాన కార్యదర్శి: గడ్డం భీమయ్య చమన్ ఖాన్ దొడ్డి గ్రామ సర్పంచ్ కోశాధికారి: శేకమ్మ గొర్లఖాన్ దొడ్డి గ్రామ సర్పంచ్ ఈ సి మెంబర్స్ 1.వెంకటేష్ నాయక్ వాయల కుంట తండా గ్రామ సర్పంచ్
2.మాల నాగరాజు గట్టు గ్రామ సర్పంచ్. 3.శంకరమ్మ అంతంపల్లి గ్రామ సర్పంచ్ 4.పద్మమ్మ గంగిమాన్ దొడ్డి గ్రామ సర్పంచ్ 5.ఎం దేవేందర్ చిన్నోని పల్లి గ్రామ సర్పంచ్ వీరందరూ ఏకగ్రీవంగా గట్టు మండల సర్పంచ్లు సంఘం నూతన కార్యవర్గం గా ఎన్నిక కావడం జరిగినది. సర్పంచ్లు సంఘం అధ్యక్షుడిగా వివిధ గ్రామాలలోని సర్పంచ్లు సమస్యలను అధికారులు దృష్టికి ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకువెళ్లి గ్రామాల అభివృద్ధి కోసం నా వంతుగా కృషి చేస్తానని తెలిపారు.



