జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 29
ప్రకాశం జిల్లా తర్లుపాడు లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తర్లుపాడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కార్గే , ఏపీ సి సి చీఫ్ శ్రీమతి వై.ఎస్. షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. సుదీర్ఘ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర కలిగిన, దేశం–రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తర్లుపాడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా తర్లుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ హుస్సేన్ మాట్లాడుతూ,దేశ ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ పాత్ర అనిర్వచనీయమని, రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షేక్ రెహానా బాను, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అబ్దుల్లా, షేక్ ఖాసిం, షేక్ రబ్బానీ, ఇమ్రాన్, షేక్ అల్తాఫ్తో, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.అదేవిధంగా, జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ భారతదేశ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టడం పార్టీకి గర్వకారణమని,. ఆయన హాజరై ఉంటే కార్యక్రమం మరింత ఘనంగా జరిగేదని తెలిపారు.పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.


