జనంన్యూస్. 29. సిరికొండ. శ్రీనివాస్ పటేల్.
సిరికొండ గ్రామ పంచాయతీలో మన దేశ మహానుభావుల చిత్రపటాన్ని బహుమతిగా అందజేశారు . ఈ చిత్రపటాన్ని అందజేయడానికి కారణం ఏమిటంటే—సిరికొండ గ్రామ యువత దేశ మహానుభావుల జీవితాల నుంచి ప్రేరణ పొంది, గ్రామాభివృద్ధి దిశగా ముందుకు సాగాలని నమ్మకం వ్యక్తం చేయడమే.
మొదటగా సేవాలాల్ మహారాజ్ బంజారా ప్రజలు సుమారు 300 సంవత్సరాల క్రితం మూఢనమ్మకాల కారణంగా జ్వరాలు వచ్చినప్పుడు దయ్యం వచ్చిందని భావించి బలులు ఇచ్చే పరిస్థితి ఉండేది. అటువంటి అజ్ఞాన పరిస్థితుల నుంచి ప్రజలను బయటకు తీసుకువచ్చిన మహానుభావుడు సేవాలాల్ మహారాజ్.
సావిత్రీబాయి ఫూలే —భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె భర్త జ్యోతిరావు ఫూలే రాత్రిళ్లు చదువు చెప్పగా, ఉదయం ఆమె పాఠశాలకు వెళ్లి పిల్లలకు విద్య బోధించేవారు. ఆ సమయంలో “మహిళలు బయటకు రావద్దు” అనే మూఢనమ్మకాల వల్ల గ్రామస్తులు ఆమెపై టమాటాలు, గుడ్లు విసిరేవారు. అయినా ఆమె భయపడకుండా మరో చీరను సంచిలో పెట్టుకొని, పాఠశాల బాత్రూమ్లో చీర మార్చుకొని, పిల్లలకు చదువు చెప్పడం కొనసాగించారు. ఆమె ధైర్యం, పట్టుదల మహిళా విద్యకు బాట వేసింది.ఝాన్సీ లక్ష్మీబాయి —వంటగదికే పరిమితం కాకుండా, తన రాజ్యాన్ని పాలిస్తూ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన వీరనారి.
డా. బీ.ఆర్. అంబేద్కర్.అందరూ సమానులే అనే నమ్మకంతో, చట్టం అందరికీ సమానంగా ఉండాలని విశ్వసించిన మహానుభావుడు.శివాజీ మహారాజ్ —పాలన అనేది ప్రజల కోసం ఉండాలని నమ్మి, ప్రజాహిత పాలనకు ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు.సుభాష్ చంద్రబోస్ —స్వాతంత్ర్యం కోసం పోరాడేందుకు యువతను సైన్యంలో చేరి, అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని ప్రేరేపించిన నాయకుడు.
భగత్ సింగ్ —దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన అమర వీరుడు.ఇలాంటి మహానుభావుల జీవితాలను చూసి ప్రేరణ పొందిన గ్రామ యువత, గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని మేము గట్టిగా నమ్ముతూ, ఈ చిత్రపటాన్ని సిరికొండ గ్రామ పంచాయతీకి భానుహమతి గా ఇచ్చరు.



