తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 29 డిసెంబర్
మాజీ ప్రజా ప్రతినిధులైనటువంటి మాజీ సర్పంచుల బిల్లులను చెల్లించాలని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ దిడిగి మాజీ సర్పంచ్ కరుణ్ రాజ్ ,రాయి పల్లి డి సర్పంచ్ విజయ్ గారిని ఈ రోజు తెల్లవారుజామున ఇంటి వద్ద అరెస్ట్ చేసి జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్బంగా తట్టు నారాయణ మాట్లాడుతూ ఎన్నాళ్లీ అరెస్టులు రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇప్పటి వరకు పోలీసులు పది పదిహేను సార్లు అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బధించడం జరిగిందని మాజీ సర్పంచులు గ్రామ ప్రథమ పౌరులుగా కొనసాగి అప్పులు తెచ్చి గ్రామాల్లో సిసి రోడ్లు మురికి కాలువలు నిర్మించి వీధి లైట్లు వేయించి ఇలా అనేక కార్యక్రమాలకు గ్రామ పంచాయితీ లో నిధులు లేనప్పటికీ సొంత డబ్బులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచులను అగౌరవపరుస్తూ పెండింగ్ బిల్లులను చెల్లించడం చేతగాక పోలీసులచే అక్రమ అరెస్టులను చేయించడం దారుణం అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడం ఆపి పెండింగ్ బిల్లులను చెల్లించడానికి చొరవ చూపాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు…


