జనం న్యూస్ డిసెంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన,
చెయ్యేరు శ్రీనివాస స్వయం ప్రతిపత్తి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారండిపార్ట్మెంట్ అఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, వీ క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్,హైదరాబాద్ అధ్వర్యంలో నేషనల్ లెవెల్ వన్ డే హాక్థన్ జరిగింది కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు సభాద్యక్షతన జరిగిన కార్యక్రమములో ముఖ్య అతిధులుగా జె ఎన్ టి యు కాకినాడ ప్రొఫెసర్, డైరెక్టర్ఎన్. బాలాజీ, ప్రొఫెసర్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగాధిపతి శఎన్ రామకృష్ణయ్య ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.విద్యార్థులుని వివిధ రంగములలో ఉత్తమంగా తీర్చిదిద్దుటకు, సాంకేతిక ప్రతిభని వెలికి తీసేందుకు నేషనల్ లెవెల్ వన్ డే హాక్థన్ ఐగనిట్ ఎంత గానో ఉపయోగపడుతుంది అని అన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 3 లక్షల విలువ చేసే క్యాష్ బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో సుమారు ౩౦ ఇంజనీరింగ్ కళాశాలల నుండి 850 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనపరిచారు.ఈ కార్యక్రమములో కళాశాల రీసెర్చ్ డీన్ డాక్టర్ వై వెంకట్, డీన్ డాక్టర్ బి రత్న రాజు, డీన్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ బి అరుణ్ కుమార్, డీన్ అకాడెమిక్స్ డాక్టర్ టీ వీ రవి కుమార్ , కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ వి సాయిప్రియ, వీ క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రతినిధి డాక్టర్ ఎన్ గణపతి రాజు, టెక్ మహీంద్రా ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ పి మోహన్ వివిధ విభాగాధిపతులు పాల్గొనారు.కళాశాల సెక్రటరీ , కరస్పాండెంట్ డి వి ఎన్ ఎస్ వర్మ విజేతలను అభినందించారు, ఈ కార్యక్రమం విద్యార్థులకు ఉపాధికల్పనకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.



