జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ హెచ్చరించినా తగ్గని వైనం.
నందలూరులో నూతనంగా ఏర్పాటైన ‘లైబా’ హోటల్ యాజమాన్యం ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. లాభార్జనే ధ్యేయంగా పెట్టుకున్న సదరు యాజ మాన్యం, సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ బరితెగిస్తోంది. హోటల్ నుండి వెలువడే మురికి నీటిని, రహదారిపైకి వదులుతూ ప్రజలకు నరకం చూపిస్తోంది.lఈ హోటల్ నిర్వాకం ‘పగలు రాజసం.. రాత్రి రాక్షసత్వం’ అన్నట్లుగా ఉంది. అధికారులు, ప్రజలు గమనించరనే ధీమాతో అర్ధరాత్రి వేళల్లో హోటల్‌లోని కంపు కొడుతున్న మురికి నీటిని, మూడు నాలుగు రోజుల పాటు నిల్వ ఉంచిన వ్యర్థాలను కలిసిన మురుగు నీరుని రహదారిపైకి వదులుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా భరించలేని దుర్వాసనతో కంపు కొడుతోంది. రాత్రి వేళల్లో అటుగా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ముక్కు మూసుకుని, ఊపిరి బిగబట్టి వెళ్లాల్సిన దౌర్భాగ్య స్థితి నెలకొంది.హెచ్చరికలు బేఖాతరు:లైబా హోటల్ చేస్తున్న ఈ సంఘటన పై హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉమ్మడి జిల్లా చైర్మన్ డేవిడ్ కళ్యాణి రాజ్ ఇప్పటికే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించవద్దని, నిబంధనలు పాటించాలని స్వయంగా హెచ్చరించినప్పటికీ హోటల్ సిబ్బంది తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. పైగా యథేచ్ఛగా అదే తప్పును పునరావృతం చేస్తూ స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.అధికారుల కళ్లుగప్పి:అంటువ్యాధు లకు ఆహ్వానం! నిల్వ ఉన్న వ్యర్థాలనురోడ్డుపైకి వదలడం వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కళ్లుగప్పి గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ ‘గలీజ్ దందా’పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి,ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడుతున్న లైబా హోటల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


