జనం న్యూస్ డిసెంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన పంచాయతీ పరిధిలోని మొండి పోరా గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగి తాటాకిల్లు దగ్ధమైన సంగతి తెలిసిందే. సోమవారం కాట్రేనికోన సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ బాధితులను పరామర్శించారు. రూ 5000 నగదు బాధితులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో చొల్లంగి వెంకటేశ్వరరావు, కుంచె రాజు, కముజు మల్లికార్జున రావు,వాసంశెట్టి శ్రీనివాసరావు,నందిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


