Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : భవిష్యత్తు ఏ రంగానికి అవకాశం ఉంటుందో, తక్షణమే పెట్టుబడులు సాధించే అవకాశం ఏ రంగం కల్పిస్తుందో క్షుణ్ణంగా తెలుసుకోగలిగిన విజినరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు పాటు అమల్లో ఉండే విధంగా ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన, కుసుమ్ వంటి పథకాలను కూడా కలుపుకుని రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి, పెట్టుబడులు ఆకర్షణ, నైపుణ్యం పెంపును ప్రోత్సహించడానికి, సమగ్రమైన ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2004 రూపొందించారని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు చంద్రబాబు ముందుచూపుని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని హామీని సహకారం చేయడంలో పునరుత్పాదక రంగం కీలకంగా మారిపోతుందని, లక్షల కోట్లు పెట్టుబడి ఆకర్షించడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా బాలపడటమే కాకుండా , ప్రాజెక్టులు కోసం భూమి వినియోగం వల్ల గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు పెరుగుతాయని, సౌర,పవన, హైడ్రోజన్,వంటి శుద్ధమైన ఇంధనం వనరుల ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందని వెంకటరావు అన్నారు. రాష్ట్రంలో పునరుత్పాదిక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని, అనేక రాష్ట్రాలు ఒత్తిడి చేసిన, 65 వేల కోట్లు పెట్టుబడితో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో మొత్తం 11 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 2,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తుందని వెంకటరావు తెలిపారు. ఇటీవల జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ కింద అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ టి పి సి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా 1,84,700 కోట్లు నిధులతో దేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారని, 57,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ ప్రాజెక్టు 1500 టీపీడి టన్నులు, గ్రీన్ హైడ్రోజన్ 7500 ఉత్పత్తి చేసే సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిదారుగా రూపొందు పోతుందని, ఐదు సంవత్సరాల 20 లక్షలు ఉద్యోగులు కల్పన చేస్తామని ఎన్డీఏ కూటమి సూపర్ సిక్స్ హామీని సహకారం చేయడంలో పునరుత్పాదిక ఇంధన రంగం కీలకంగా మారబోతుందని, రాష్ట్రం ఆర్థికంగా బలపడడమే కాకుండా, ప్రాజెక్టుల కోసం భూమి వినియోగం వల్ల గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు పెరుగుతాయని వెంకటరావు అన్నారు. అనకాపల్లి పార్లమెంట్ అధికారి ప్రతినిధి కడిమిశెట్టి నరసింగరావు ( సింగ్) భోగిలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ పాల్గొన్నారు./