Listen to this article

జనం న్యూస్ 30 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ భూముల అక్రమ తవ్వకాలు, పురాతన కట్టడాల పరిరక్షణపై సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ గళమెత్తింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.ప్రధాన సమస్యలు: అక్రమ మట్టి తవ్వకాలు: గట్టు మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలాల నుండి అక్రమంగా మట్టిని తవ్వి విక్రయిస్తున్నారని, దీనిపై గ్రామ పంచాయతీ తీర్మానం చేసినా అధికారులు స్పందించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.చారిత్రక బావుల కబ్జా: గద్వాల మున్సిపల్ పరిధిలోని పురాతన కట్టడాల మెట్ల బావి అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోవడం లేదని అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల సమస్య: అక్రమాలను ప్రశ్నిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులపై రాజకీయ అండదండలతో దాడులకు దిగుతున్నారని, ఇది శాంతి భద్రతల విఘాతానికి దారితీస్తోందని పేర్కొన్నారు.తక్షణ చర్యలకు డిమాండ్:గాంధీజీ కన్న ‘గ్రామ స్వరాజ్యం’ కల నెరవేరాలంటే గ్రామాల్లో జరుగుతున్న ఇటువంటి అక్రమాలను అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు కె. మోహన్ రావు డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై పోలీస్ కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు