Listen to this article

గోటి తలంబ్రాల దీక్షలో తెలంగాణ నుండి రామకోటి సంస్థకు చోటు

-26 సంవత్సరాల కృషి, పట్టుదలను గుర్తించి కల్పించిన అవకాశం

జనం న్యూస్,ఫిబ్రవరి 5 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )భద్రాచల సీతారాముల కళ్యానానికి గోటితో ఓలిచిన తలంబ్రాలు మాత్రమే వాడుతారు. ఈ గోటి తలంబ్రాల దీక్షలో పాల్గొనేందుకు కొన్ని ధార్మిక సేవా సంస్థలకు చోటు కల్పించారు. అందులో తెలంగాణ రాష్ట్రం నుండి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్త సమాజం సంస్థకు ముచ్చటగా మూడోసారి అవకాశం కల్పించింది భద్రాచల దేవస్థానం.ఈ సందర్బంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ గత 26 సంవత్సరాలనుండి మేము చేస్తున్న నిర్వీరామ కృషి, పట్టుదల గుర్తించి ఈ అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. గత 2సంవత్సరాల నుండి గోటి తలంబ్రాల్లో పాల్గొనే అవకాశం రావడం ఒక సారి 20కిలోలు, ఇంకోసారి 150కిలోల గోటి తలంబ్రాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, గ్రామాన తిరిగి లక్షల మంది భక్తులచే రామనామ స్మరణ చేయించి ఓలిపించి భక్తితో కళ్యానానికి అందించామని తెలిపారు.గత సంవత్సరం కన్న ఈ సారి ఎక్కువ గోటి తలంబ్రాలు అందజేస్తామని భద్రాచల దేవస్థానం తెలపడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే భద్రాచలం వెళ్ళనున్నట్లు సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు తెలిపారు.